- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్లు హ్యాక్
తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా సైబర్ నేరగాళ్లు రాష్ట్ర పోలీస్ వెబ్ సైట్లను హ్యాక్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా సైబర్ నేరగాళ్లు రాష్ట్ర పోలీస్ వెబ్ సైట్లను హ్యాక్ (Police websites hacked) చేశారు. ఒక బెట్టింగ్ సైట్ (Betting site) ముఠా.. నగరంలోని పోలీస్ కమిషనరేట్ల వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసినట్లు తెలుస్తుంది. దీని ఫలితంగా, గత పది రోజులుగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల వెబ్‌సైట్లు సరిగా పనిచేయడం లేదు. ఈ కమిషనరేట్ల వెబ్‌సైట్‌లను (Commissionerate websites) తెరవడానికి ప్రయత్నించినప్పుడు అవి ఆటోమేటిక్‌గా బెట్టింగ్ యాప్ వెబ్‌సైట్‌లకు రీ-డైరెక్ట్ అవుతున్నాయి. ఇది సైబర్ భద్రత విషయంలో ఆందోళన కలిగించినప్పటికీ, సమస్యను గుర్తించిన ఐటీ విభాగం (IT Dept) వెంటనే స్పందించింది. ప్రస్తుతం, హ్యాకింగ్‌కు గురైన ఆయా సర్వర్‌లను పూర్తిగా డౌన్ చేయడం జరిగింది. తద్వారా పౌరులు ఇకపై బెట్టింగ్ సైట్లకు దారి మళ్లించబడకుండా నివారించారు. ఈ చర్య ద్వారా అధికారులు వెబ్‌సైట్‌లను పునరుద్ధరించి, భద్రతా లోపాలను సరిచేసే పనిని ప్రారంభించినట్లు తెలుస్తుంది. కాగా పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్ సైట్ల హ్యాకింగ్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.






