- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రెడిట్ కార్డును ఎక్కువగా వాడుతున్నారా?.. ఈ విషయం తెలుసుకోకపోతే భారీ నష్టం తప్పదు!
ప్రస్తుతం దేశంలో డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. ఎక్కడికైనా షాపింగ్‌కి వెళ్లినా, తినడానికి వెళ్లినా చెల్లింపుల కోసం కార్డు తీస్తున్నాం, లేదా యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలో డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. ఎక్కడికైనా షాపింగ్‌కి వెళ్లినా, తినడానికి వెళ్లినా చెల్లింపుల కోసం కార్డు తీస్తున్నాం, లేదా యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా షాపింగ్స్‌కు వెళ్లినప్పుడు క్రిడిట్ కార్డ్స్ వాడటం సర్వసాధారణం అయిపోయింది. అయితే.. క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు(Telangana Police) హెచ్చరిస్తున్నారు. ‘ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను ఒకసారి చెక్ చేయండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా అలాంటి వెబ్‌సైట్‌లో ఆర్థిక లావాదేవీలు చేయొద్దు. వెబ్‌సైట్లలో మీ క్రెడిట్ కార్డు(Credit Card) వివరాలు సేవ్ చేయకపోవడం మంచిది’ అని పోలీసులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కలిగేలా ఓ వీడియో సైతం విడుదల చేశారు.
మరోవైపు.. ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, వంటి మోసపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున పబ్లిక్ పరికరాలు, వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా ఉండటం మంచిదని సూచించారు. పేరున్న, ధృవీకరించిన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించడం మంచిదని అన్నారు. విశ్వసనీయ వెబ్‌సైట్‌లు తరచుగా ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలకు అధిక స్థాయి రక్షణను అందిస్తాయని పేర్కొన్నారు.






