- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
News Sharings: సోషల్ మీడియాలో వార్తలు షేర్ చేస్తున్నారా..? తెలంగాణ పోలీస్ హెచ్చరిక
సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు, పోస్టులు షేర్ చేసే ముందు వాటి నిజానిజాలు తప్పనిసరిగా పరిశీలించాలంటూ తెలంగాణ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (social media) సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు, పోస్టులు షేర్ చేసే ముందు వాటి నిజానిజాలు తప్పనిసరిగా పరిశీలించాలంటూ (Telangana Police) తెలంగాణ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తప్పుడు సమాచారం లేదా నిర్ధారణ లేని పోస్టులు సమాజంలో అపోహలు, ఉద్రిక్తతలు కలిగించే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు షేర్ చేసే ముందు జాగ్రత్త.. ఫార్వర్డ్ చేసే ముందు చెక్ చేసుకోవాలంటూ సోమవారం @TelanganaCOPs ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీస్ ఆసక్తికర పోస్ట్ చేశారు.
వార్తను షేర్ చేయడానికి ముందు అది నిజమా కాదా అనేది నిర్ధారించుకోవాలని సూచించారు. తప్పుడు ప్రచారంలో భాగస్వాములు కావొద్దని తెలిపారు. వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఏదైనా వార్తను షేర్ చేసే ముందు నిర్ధారణ ముఖ్యమని మరోసారి నొక్కి చెప్పారు. తప్పుడు వార్తల్ని ప్రచారం చేసి చిక్కుల్లో పడొద్దని సూచించారు. సెన్సేషనలిజం కోసం పాకులాడొద్దని, ఫేక్ వార్తల ప్రచారంలో మీరు భాగస్వాములు కాకుండా చూసుకోండని తెలిపారు. ట్వీట్ ఇదే..






