Alert: రాఖీ గిఫ్ట్ అంటూ ఫేక్ లింక్స్.. స్పెషల్ ఆఫర్ పేరిట సైబర్ వల : తెలంగాణ పోలీస్ అలర్ట్

by Ramesh Naini |   (  Updated:2025-08-05 13:44:27  IST  )

దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. కొత్త కొత్త పద్దతుల్లో సైబర్ కేటుగాళ్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

Alert: రాఖీ గిఫ్ట్ అంటూ ఫేక్ లింక్స్.. స్పెషల్ ఆఫర్ పేరిట సైబర్ వల : తెలంగాణ పోలీస్ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో సైబర్ నేరాలు (Cybercrime) విపరీతంగా పెరుగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. కొత్త కొత్త పద్దతుల్లో సైబర్ కేటుగాళ్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు సైబర్ నేరాలకు గురికాకుండా తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీసులు (Telangana Police tweet) ఆసక్తికర పోస్ట్ చేశారు. రాఖీ గిఫ్ట్ అంటూ ఫేక్ లింక్స్ (fake links) వస్తాయని పోలీసులు అలర్ట్ (Alert) చేశారు. రాఖీ పండుగ గ్రీటింగ్స్‌, ఆఫర్స్‌ పేరిట సైబర్ మోసగాళ్లు వేస్తున్న వలలో పడొద్దని సూచించారు. కలర్‌ఫుల్ రాఖీ గ్రీటింగ్స్‌ అంటూ వచ్చే లింక్స్‌ను క్లిక్ చేయకండని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని సోషల్‌ మీడియాలో షేర్ చేయొద్దని పేర్కొన్నారు. సైబర్‌ మోసాలపై అవగాహనతోనే నేరాల కట్టడి సాధ్యమని తెలిపారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు కోసం 1930ను సంప్రదించాలని పోలీసులు ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ లింక్..

Next Story