తెలంగాణ పోలీస్ జట్టు ఘన విజయం.. ఎపీలో జరిగిన అఖిల భారత పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్

by Ramesh Naini |   (  Updated:2026-02-22 15:44:45  IST  )

అఖిల భారత పోలీసు సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ పోలీస్ జట్టు ఘన విజయం సాధించింది.

తెలంగాణ పోలీస్ జట్టు ఘన విజయం.. ఎపీలో జరిగిన అఖిల భారత పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అఖిల భారత పోలీసు సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ పోలీస్ జట్టు ఘన విజయం సాధించింది. ఎపీలోని మూలపాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ఆదివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో తెలంగాణ పోలీసు జట్టు ఎన్ఎస్‌జీ జట్టుపై 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ పోలీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 259/2 భారీ స్కోరు సాధించింది. తెలంగాణ పోలీసు జట్టులోని లోకనాథ్ నాయక్ 58 బంతుల్లో 119 పరుగులు చేసి అద్భుత సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సి.వి. ఆనంద్, బ్యాటింగ్‌లో రాణించి 40 పరుగులు సాధించారు. ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో తనదైన పాత్ర పోషించారు. లక్ష్యాన్ని ఛేదించడంలో ఎన్‌ఎస్‌జీ జట్టు విఫలమై 18.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. తెలంగాణ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభ కనబరచిన లోకనాథ్ నాయక్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును సీవీ ఆనంద్, ఏపీ డీఐజీ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అన్బురాజన్ అందచేశారు.

Next Story