- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Smita Sabharwal: హెచ్ సీయూ భూములపై రీ ట్వీట్.. స్మితా సబర్వాల్ కు పోలీసుల నోటీసులు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) కు తెలంగాణ పోలీసులు (Telangana Police) షాకిచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli Lands) విషయంలో ఫేక్ ప్రచారం విషయంలో ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టు ఆమె నోటీసులకు కారణం అయింది.
రీ పోస్టు ఎఫెక్ట్ :
హెచ్ సీయూకు ఆనుకుని ఉన్న కంచగచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియా వేదికగ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడ పర్యావరణ విధ్వంసం, జంతుజాలం ఆవాసం కోల్పోయాయని నెటిజన్లు రకరకాల వీడియోలు ఫోటోలు షేర్ చేశారు. అయితే వాటిలే చాలా వరకు ఫేక్, ఏఐ ఆధారిత ప్రచారమే ఉందని ప్రభుత్వం చెప్పడంతో తాము చేసిన పోస్టులను చాలా మంది తొలగించారు. అయితే మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ పోస్టు చేసిన ఓ ఇమేజ్ ను స్మితా సబర్వాలా రీ ట్వీట్ చేశారు. హెచ్ సీయూలోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు వాటి ముందు నెమలి, జింకను గిబ్లీ శైలిలో ఉన్నట్లు ఆ ఇమేజ్ ఉంది. ఈ పోస్టుని స్మితా సబర్వాల్ రీ ట్వీట్ (Re Tweet) చేయగా ఇది ఫేక్ ఇమేజ్ అని పోలుసు గుర్తించారు. దీంతో ఈ పోస్టును రిట్వీట్ చేసిన స్మితా సబర్వాల్ కు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు గచ్చిబౌలి పీఎస్ ఎస్ హెచ్ వో మహ్మద్ హబీబుల్లా ఖాన్ బుధవారం జాతీయ మీడియాకు వివరించారు. అయితే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఒక కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసుల అధికారి సాక్షులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్మితాసబర్వాల్ కు నోటీసులు వెళ్లడం దానిపై ఆమె ఎలాంటి రియాక్షన్ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.