- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షంలో బండిపై బయటకు వెళ్తున్నారా?
హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) దంచికొడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) దంచికొడుతున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే కాకుండా.. తెలంగాణలో రాగల రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు.. వర్షంలో బైకులు, ఇతర వాహనాలపై బయటకు వెళ్లే వాహనదారులకు తెలంగాణ పోలీసులు(Telangana Police) కీలక సూచనలు చేశారు.
పోలీసుల సూచనలు :
= మితిమీరిన వేగం మంచిది కాదు
= రోడ్లు ఖాళీగా ఉన్నప్పటికీ పరిమిత వేగంలోనే వెళ్లాలి
= నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో నిదానం తప్పనిసరి
= రోడ్లపై వాహనాలతో స్టంట్లు చేయొద్దు
= వాహనం కండీషన్ బాగుంటేనే డ్రైవ్ చేయాలి
= బండి తీసేముందు టైర్లు చెక్ చేసుకోవాలి
= బ్రేక్‌లు సరిగా ఉన్నాయో లేవో చూడాలి
= సమయానికి సర్వీసింగ్ చేయించుకోవాలి
= తప్పనిసరిగా వాతావరణ శాఖ సూచలు పాటించాలి






