ఉచితం వెనుక మోసాన్ని గుర్తించండి: తెలంగాణ పోలీసులు

by Malleboina Mahesh |

పెరుగుతున్న సైబర్‌ ఫ్రాడ్‌లు, ఫేక్‌ ఆఫర్లు, డబ్బులు గెలుచుకున్నారని చెప్పే స్కామ్‌లు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు.

ఉచితం వెనుక మోసాన్ని గుర్తించండి: తెలంగాణ పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో సైబర్ నేరాలు (Cyber ​​crimes) పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ప్రజలకు ఆన్‌లైన్‌ మోసాల (Online scams)పై అప్రమత్తం చేశారు. ఇటీవల పెరుగుతున్న సైబర్‌ ఫ్రాడ్‌లు, ఫేక్‌ ఆఫర్లు, డబ్బులు గెలుచుకున్నారని చెప్పే స్కామ్‌లు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో “ఉచితంగా ఇస్తున్నారంటే మోసం అని గ్రహించండి” అనే శీర్షికతో పోలీసులు విడుదల చేసిన అవగాహన పోస్టర్‌ (Awareness poster) సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పోలీసులు హెచ్చరిస్తూ, “ఆన్‌లైన్‌లో ఫ్రీ గిఫ్టులు, కూపన్లు, డిస్కౌంట్‌ ఆఫర్లు వస్తే నమ్మకండి. డబ్బులు రిఫండ్‌ అవుతాయని చెప్పే ఫేక్‌ లింకులు ఓపెన్‌ చేయవద్దు. అనుమానాస్పద లింకులు క్లిక్‌ చేయకుండా జాగ్రత్తపడండి. సైబర్‌ మోసాల నుంచి తప్పించుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే లావాదేవీలు చేయండి” అని పోలీసులు సూచించారు. ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని తెలంగాణ పోలీసులు వెల్లడిస్తూ, మోసపూరిత ప్రకటనలు, లింకులు కనపడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ లేదా సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story