వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో భరించొద్దు.. వెంటనే ఆ పనిచేయడంటూ పోలీసుల సూచన

by Gantepaka Srikanth |

పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో తరచూ మహిళలు(Womens) వేధింపులకు గురవుతుండటం మనం చూస్తుంటాం.

వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో భరించొద్దు.. వెంటనే ఆ పనిచేయడంటూ పోలీసుల సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో తరచూ మహిళలు(Womens) వేధింపులకు గురవుతుండటం మనం చూస్తుంటాం. కొందరు ధైర్యంగా పోలీసులకు ఫోన్‌లు చేసి కంప్లైంట్‌లు చేస్తుండగా.. మరికొందరు భరిస్తూ ముందుకు సాగుతుంటారు. అలాంటి వారిలో ధైర్యం నింపేలా తెలంగాణ పోలీసులు(Telangana Police) అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా మరో ట్వీట్ చేశారు. ‘వేధింపులను అస్సలు మౌనంగా భరించకండి. ధైర్యంగా ముందడుగు వేసి ఫిర్యాదు చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వేధింపులను భరిస్తూ కుంగిపోవద్దు’ అని మహిళలకు పోలీసులు సూచనలు చేశారు.

Next Story