CM Revanth Reddy ఆ రూట్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

గచ్చిబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు.

CM Revanth Reddy ఆ రూట్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నిస్తామని అందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం, మద్దతు అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని స్వాతంత్ర్యానికి ముందు ఆ తర్వాత కూడా హైదరాబాద్‌లో బీడీఎల్, హెచ్‌ఎచ్‌ఎల్, మిథాని, డీఆర్‌డీఓ వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పని చేస్తున్నాయన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా డీఆర్‌డీవో విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bangalore) ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. గతంలో మీతో చర్చించినట్టుగా హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని రాజ్ నాథ్ సింగ్ ను సీఎం కోరారు. తద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం (స్కై రూట్) వంటి స్టార్టప్‌లు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉందన్నారు.

లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి , దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని, అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి ఏటా లక్షకు పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళుతున్నారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్ధవంతమైన ఇంజినీర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యం అన్నారు.

నేనూ సైన్స్ విద్యార్థినే: రాజ్ నాథ్ సింగ్

సర్ సీవీరామన్ ఫిబ్రవరి 28న రామన్ (Raman effect) ఎఫెక్ట్ క నుగొన్నారని నోబెల్ గ్రహిత రామన్ గౌరవార్థం ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నేను కూడా సైన్స్ విద్యార్తినే అని కొన్నాల్లు సైన్స్ అధ్యాపకుడిగా పని చేశానని గుర్తు చేశారు. ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందని చెప్పారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందని సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. ఇన్నోవేషన్, దేశ ప్రగతిలో విద్యార్థులతో కీలకపాత్ర అని నూతన ఆవిష్కరణలకు భారత్ హబ్ గా మారుతున్నదని చెప్పారు.

Next Story