తెలంగాణ PECET ఫలితాల విడుదల

by Muthe.Rajitha |

తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PECET) 2025 ఫలితాలు నేడు విడుదలయ్యాయి.

తెలంగాణ PECET ఫలితాల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PECET) 2025 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ పరీక్షను పాలమూరు విశ్వవిద్యాలయం, తెలంగాణ ఉన్నత విద్యా మండలి(TGCHE) సంయుక్తంగా జూన్ 11 నుంచి 14 వరకు నిర్వహించింది. ఈ పరీక్ష బీ.పీ.ఎడ్, డీ.పీ.ఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించబడింది. ఈ ఫలితాలను హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ వీ. బాలకృష్ణారెడ్డి(V. BalakrishnaReddy) విడుదల చేశారు. బీ.పీ.ఎడ్‌లో 95.79%, డీ.పీ.ఎడ్‌లో 92.61% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ pecet.tsche.ac.in లో ర్యాంక్ కార్డ్ రూపంలో పొందవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి వచ్చేనెలలో కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు.

Next Story