- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీరియస్.. ఆ టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ
పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Polavaram-Banakacherla Link Project)పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Polavaram-Banakacherla Link Project)పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం కొత్త టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచర్ల టెండర్, సర్వే నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆమోదించవద్దని కోరింది. పోలవరం డీపీఆర్‌కు విరుద్ధంగా ఈ టెండర్ ఉందని తెలంగాణ ఆరోపించింది.
కాగా, ఇటీవలే ఈ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ‘బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా తెలంగాణ అభ్యంతరాలు తెలిపాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై మేం ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించాం. ఈ విషయంలో రాజీ పడబోం’ అని ఉత్తమ్ వివరించారు.






