- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం
తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివప్రసాద్ శుక్లా నేడు హైదరాబాద్ కు రానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా నియమితులైన విషయం తెలిసిందే. తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్ గా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమిస్తూ.. రాష్ట్రపతి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివప్రతాప్ శుక్లా నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుండగా.. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో కలిసి స్వాగతం పలుకనున్నారు. రేపు తెలంగాణ గవర్నర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. ఆ రోజు గవర్నర్ తొలిప్రసంగం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివప్రతాప్ శుక్లా సీనియర్ బీజేపీ నాయకులు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా (2017-2019) పనిచేసిన ఆయన.. రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. ఫిబ్రవరి 2023 నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్ గా ముంబైలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.






