మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న మంత్రులు

by Ajay Maddhiboyina |

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు, కొండా సురేఖ‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ మేడారం చేరుకుని అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు.

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న మంత్రులు
X

దిశ, వెబ్ డెస్క్: మేడారం మ‌హాజాత‌ర ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల పాటు మ‌హాజాత‌ర సాగ‌నుంది. కాగా జాత‌ర ముందే భ‌క్తుల తాకిడి మొద‌లైంది. తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుండి భ‌క్తులు అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకునేందుకు వ‌స్తున్నారు. ఇక నేడు తెలంగాణ మంత్రులు సైతం వ‌న దేవ‌త‌లను ద‌ర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు, కొండా సురేఖ‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ మేడారం చేరుకుని అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. వీరికి మంత్రి సీత‌క్క మ‌రియు అధికారులు హెలిప్యాడ్ వ‌ద్ద స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. మేడారం జాత‌ర‌కోసం రూ.150 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు. శాశ్వ‌త నిర్మాణాల కోసం రూ.101 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు చెప్పారు. ప్ర‌పంచానికి స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ వైభ‌వం తెలిసేలా జాత‌ర ఏర్పాట్లు చేశామ‌న్నారు.

Next Story