- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ప్రతినియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు.. సెంట్రల్ మిస్టర్ కు రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి
కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీని తెలంగాణ మంత్రులు కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ కేంద్ర కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీతో (Jitan Ram Manjhi) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గంలో రెండు ఎంఎస్ఎంఈ పార్కులకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తకి చేశారు. నియోజకవర్గంలోని యెండపల్లి, రేమిడిచెర్లలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రితో భేటీకి సంబంధించిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కేంద్ర మంత్రిని కలిసి ఎంఎస్ఎంఈ (MSME) పార్కుల ఏర్పాటుకు మద్దతు కోరామన్నారు. స్థానికంగా ఉపాధి, వ్యవస్థాపకతను పెంచడానికి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ భేటీలో పై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ సానుకూలంగా స్పందించినట్లు ఎక్స్ లో పోస్టు చేశారు.






