- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు మంత్రులు జూపల్లి, సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, ఆకాంక్షలతో ఉత్సాహంగా నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించి, భవిష్యత్తుకు సరైన ప్రణాళికలు రచించుకోవడం ద్వారానే జీవితాల్లో గుణాత్మక మార్పు సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా యువత తమకంటూ స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని, దృఢ సంకల్పంతో వాటి సాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల ఆశయాల సాధనే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ఏడాది రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం , ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఒక ప్రకటనలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా, సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత సమృద్ధిగా, సమానత్వంతో, ఐక్యతతో వర్ధిల్లాలని ఆమె కోరుకున్నారు.






