మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేత బడే చొక్కారావు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-18 14:47:56  IST  )

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌(Encounter)లో మావోయిస్టు(Maoists)లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేత బడే చొక్కారావు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌(Encounter)లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత(Telangana Maoist Party Key Leader) బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతిచెందారు. ఆయనతో పాటు మరో 18 మంది మావోయిస్టులు కూడా మృతిచెందారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్టు పార్టీనే నిర్ధారించింది. ఎన్నో ఏళ్లుగా దామోదర్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆ పార్టీలో పనిచేశారు. దామోదర్‌తో పాటు ఏకంగా ఒకేసారి 17 మంది మృతిచెందడం మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరు నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డు ఉంది. ఆయనది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. చొక్కారావుతో పాటు మరో తెలుగు నేత నర్సింహారావు రావు కూడా ఉన్నట్లు దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరిట విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.







Next Story