కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలి

by Gantepaka Srikanth |

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలంటూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలంటూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. శనివారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర అద్యక్షురాలు మొగిలి సునీతారావు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.. హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని సిగ్నేచర్స్ కార్యక్రమం నిర్వహించామన్నారు. జిల్లాలలో కూడా సిగ్నేచర్స్ నిర్వహించాలని ఆమె సూచించారు. కాగా, హర్ధీప్ సింగ్ రాజీనామా చేయాలంటూ నిరసనలు చేపడుతున్నామని, మార్చి 1నుంచి 4 వరకూ జిల్లా కార్యవర్గాలు మీడియా సమావేశాలు నిర్వహించాలని, సంతకాల సేకరణ చేయాలని సునీతారావు తెలిపారు. మార్చి 5 నుంచి 7 వరకూ బ్లాక్ డ్రెస్సెస్ ధరించి పాదయాత్ర చేసి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేయాలని, ఆయన దిష్టిబొమ్మ దహనం చేయాలని ఆమె అన్నారు. మార్చి 8న క్యాండిల్ ర్యాలీలు, మార్చి 9,10 ఢిల్లీలో పార్లమెంటు గైరావ్‌కు జాతీయ అధ్యక్షురాలు ఆల్కలంబతో కలిసి పాల్గొనాలని, ఈ కార్యక్రమంలో మహిళా విభాగ నేతలందరూ పాల్గొనాలని సునీతారావు తెలిపారు. అంతకు ముందు హర్దీప్ సింగ్ పూరి దిష్టిబొమ్మను మహిళా కాంగ్రెస్ నేతలు దహానం చేశారు.

Next Story