- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం గేట్ల ఎత్తివేతపై.. కేంద్రానికి తెలంగాణ కీలక లేఖ
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది పరుగులు పెడుతుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తడంతో.. ప్రస్తుతం నిండుకుండలా మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది పరుగులు పెడుతుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వరద పోటెత్తడంతో.. ప్రస్తుతం నిండుకుండలా మారిపోయింది. జూరాల, సుంకేసుల జలాశయం నుంచి భారీగా వరద వస్తుండటంతో ఈ రోజు సాయంత్రం లేదా, రేపు ఉదయం శ్రీశైలం క్రస్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అధికారులు (Telangana officials) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శ్రీశైలం డ్యాంను ఏపీ నిర్లక్ష్యం చేస్తోందని, శ్రీశైలం డ్యాం గేట్లు (Srisailam Dam Gates) ఇప్పుడే ఎత్తరాదని కేంద్రానికి తెలంగాణ రాసిన లేఖలో తెలిపింది. మరికొన్ని గంటల్లో గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధం అవుతున్న క్రమంలో.. తెలంగాణ లేఖపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో నని చర్చ మొదలైంది.






