తెలంగాణ ప్రజాప్రతినిధుల క్రీడా పండుగ.. ఇక మైదానంలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-26 07:48:12  IST  )

తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ఈ నెల 29, 30 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల క్రీడా పండుగ.. ఇక మైదానంలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల (MLA's & MLC's) కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయి. క్రికెట్ (Cricket), బ్యాడ్మింటన్, వాలీబాల్, టెన్నిస్ వంటి క్రీడలతో పాటు అథ్లెటిక్స్ విభాగంలోనూ పోటీలు ఉండనున్నాయి.

కాగా, నిరంతరం ప్రజా సమస్యలు, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రస్తుత శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ పర్యవేక్షణలో ఈ పోటీలు జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులకు కావాల్సిన కిట్లు, ట్రాక్ సూట్లు, వైద్య సదుపాయాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

Next Story