TG Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా

by Ramesh Naini |

తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడింది.

TG Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ 10:30 గంటలకు తొలి రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సంతాప తీర్మానం ప్రకటించిన స్పీకర్.. ఈ సందర్భంగా తుంగతుర్తి, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్​రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం జీరో అవర్ భాగంగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జీరో అవర్‌లో వాడీ వేడీ చర్చ జరిగింది. చర్చల అనంతరం జనవరి 2 కి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు. జనవరి 2 ఉదయం పది గంటలకు సభ తిరిగి ప్రారంభం అవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.

Next Story