TS LAWCET : తెలంగాణ లాసెట్ ఫలితాల విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2025-06-25 12:17:01  IST  )

తెలంగాణ లాసెట్(TS LAWCET) పీజీఎల్‌సెట్ (TS PGLCET) 2025 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.

TS LAWCET : తెలంగాణ లాసెట్ ఫలితాల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ లాసెట్(TS LAWCET) పీజీఎల్‌సెట్ (TS PGLCET) 2025 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఉన్నత విద్యామండలి(Council of Higher Education) ఆధ్వర్యంలో ఒస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో https://lawcet.tsche.ac.in విడుదలయ్యాయి. జూన్ 6న కంప్యూటర్ బేస్డ్ ఆధారితంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

కాగాLAWCET ద్వారా 3, 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, PGLCET ద్వారా ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహింపబడతాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో వెబ్‌సైట్‌లో ఫలితాలను, ర్యాంక్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. జూలైలో ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ లో ర్యాంక్ ఆధారంగా కళాశాలలు, కోర్సులు ఎంచుకోవచ్చు.

Next Story