- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో చిప్పకూడు తినొచ్చిన మీరా పవన్ గురించి మాట్లాడేది?.. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన కౌంటర్
పవన్ కల్యాణ్‌పై కవిత చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన కౌంటర్ ఇచ్చింది. గద్దర్ కూతురు వెన్నెల వ్యాఖ్యలపై జనసేన నేత ఆర్.కే స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అవినీతి కేసులో తిహార్ జైల్లో చిప్పకూడు తిని వచ్చిన కల్వకుంట్ల కవిత పవన్ కల్యాణ్ కోడిచెరువు ఆక్రమించినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ జనసేన నేత ఆర్.కే సాగర్ విమర్శించారు. తాను అవినితీకి పాల్పడితే ఆ భూమిని తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆమె కంటే ముందే చెప్పారని మరి కవిత కూడ తన ఆస్తులను బయటపెడితే అందులోని అవినీతిని తెలంగాణ ప్రజలు నిరూపిస్తారన్నారు. ప్రెస్ మీట్లకు వచ్చి గెటప్‍లు మార్చుకొని మాట్లాడటం కాదన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సాగర్.. గద్దర్ కు కారు కోనించానని పవన్ కల్యాణ్ చెబితే దానిపై కూడా రాద్దాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ పాలనలో గద్దర్ ను నాలుగు గంటల పాటు రోడ్డుపై నిలబెట్టిన ఘనత మీ ప్రభుత్వానికి కాదా అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. రాజకీయంగా తన గురించి చర్చ జరగడం కోసమే కవిత పవన్ కల్యాణ్‍ను విమర్శిస్తున్నారని ఆరోపించారు.
గద్దర్ కూతురు వ్యాఖ్యలపై..
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను గద్దర్ కూతురు వెన్నెల ఖండించడంపై స్పందించిన సాగర్.. వెన్నెలకు అన్ని విషయాలు తెలుసన్నారు. ఇవాళ ఆమె వెనుక ఉండి ఎవరు మాట్లాడించారు? అమె ఏం మాట్లాడిందో తనకు తెలియదన్నారు. చివరి రోజుల్లో గద్దర్ పక్కన ఎంత మంది ఉన్నారో వెన్నెలకు బాగా తెలుసన్నారు. తెలంగాణ ఈ ప్రాంత ప్రజల జాగీరు అని పవన్ కల్యాణే చెబుతున్నారని ఇప్పుడు మాట్లాడుతున్న వెన్నెల అమరవీరుల కుటుంబాల సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగీరా అని అడిగింది పాలకులను అని ప్రజలను కాదన్నారు. మేము తెలంగాణ బిడ్డలమే అని ఈ ప్రాంతం తెలంగాణ వారందరీ జాగీరు అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ జనసేనకు బూస్ట్ ఇచ్చిందన్నారు. అనిరుధ్ రెడ్డి ఆయనేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఆయన మూలాలు నెల్లూరు కాదా అన్నారు. డబ్బులు ఉన్నాయని ఇక్కడ టికెట్ తెచ్చుకుని గెలిచి మాట్లాడుతున్నావ్ అన్నారు. అనిరుద్ధ్ రెడ్డికి జుట్టే కాదు పవన్ కల్యాణ్‍తో ఎలాంటి పోలిక లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత అవినీతి పరుడని విమర్శించారు.






