- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ కోసం 20 ఏళ్ల జీవితం దారబోశా.. కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం లండన్ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని అన్నారు. 20 ఏళ్లు తాను బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డాను అని చెప్పారు. ‘కొందరిలో స్వార్థం మొదలైంది. వాళ్ల స్వార్థంతో కోట్లాది మందిని బాధపెడుతున్నారు. ఇంతకాలం పార్టీలో ఎన్నో కుట్రలు జరిగినా మౌనంగా ఉన్నాను. ఎంతగా ఇబ్బంది పెట్టినా ఒక్క విషయం కూడా బయటకు చెప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు మాట్లాడుతున్నాను. విషయాలు ప్రజల్లోకి వచ్చాక కూడా స్పందించకపోతే తప్పు అవుతుందని మాట్లాడుతున్నాను. అందుకే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు. పార్టీ నన్ను వద్దు అనుకున్న తర్వాతనే ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నా రాజీనామాను ఆమోదించడం లేదు. ఎందుకు ఆమోదించడం లేదో తెలియదు. కాంగ్రెస్ పాలిటిక్స్‌లో ఇది కూడా భాగం కావచ్చు. రాజీనామాను ఆమోదించాలని ఒత్తిడి చేస్తా’ అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.






