- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
26న తెలంగాణ జాగృతి ‘లీడర్’ శిక్షణ
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘లీడర్’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు.

- యువత, మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా..
- కొంపల్లిలో శిక్షణ తరగతులు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘లీడర్’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి ‘లీడర్’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ తరగతుల పోస్టర్ గతనెల 15వ తేదీన ఆవిష్కరించామని.. శిక్షణ తరగతులను శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్‌లో రెండు సెషన్స్‌గా తరగతులు ఉంటాయని తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, రాజ్యాంగంలో ఏయే అంశాలను పొందుపరిచారు? ప్రజలకు చేరువ కావాలంటే నాయకుడు ఎలా వ్యవహరించాలి? ఇలా అన్ని రకాల తరగతులు ఉంటాయని తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లీడర్ శిక్షణ తరగతులకు హాజరవుతారని వెల్లడించారు.






