- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎక్కడ? : ప్రభుత్వంపై కవితక్క ఫైర్
రాష్ట్రంలో కులగణన తప్పుగా చేశారని, బీసీల సంఖ్య తగ్గించి నమోదు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కులగణన తప్పుగా చేశారని, బీసీల సంఖ్య తగ్గించి నమోదు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. జిల్లాల వారిగా చేసిన కులగణనలో బీసీల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. మహబూబాబాద్ లో నాడు 9 శాతం ఉన్న బీసీల సంఖ్య.. కాంగ్రెస్ పాలనలో 4 శాతానికి ఎలా పడిపోయిందని ప్రశ్నించారు. 5-6 శాతం బీసీ జనాభా ప్రభుత్వం తగ్గించిందనేందుకు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో బీసీల సంఖ్యే సాక్ష్యమన్నారు.
ఆదిలాబాద్ లో 205 గ్రామాలకు 5 నాన్ షెడ్యూల్డ్ ఏరియాలు ఉంటే..2019లో 47 గ్రామాలకు బీసీ రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పెరగ్గా 23 గ్రామాలకు బీసీ రిజర్వేషన్లు వచ్చాయన్నారు. దీనిని బట్టి బీసీల సంఖ్యను గ్రామాల్లో సగానికి సగం లెక్కల్లో తక్కువగా చూపించారని స్పష్టమవుతుందన్నారు. ఆసిఫాబాద్ లో కూడా 2019లో 33 గ్రామాలకు బీసీ రిజర్వేషన్లు వస్తే.. ఇప్పుడు 20 గ్రామాలకే బీసీ రిజర్వేషన్లు వచ్చాయన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇంత తేడా ఎందుకు వస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల లెక్కలు తప్పుగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో 12,735 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాటిలో ఏజెన్సీ పంచాయతీలను తీసేయగా.. 10,223 గ్రామ పంచాయతీల్లో కేవలం 2,176 గ్రామ పంచాయతీలకు అంటే 21 శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. నిజానికి 42 శాతం రిజర్వేషన్లలో ఇది సగం మాత్రమేనన్నారు. రాష్ట్రంలో మరో 2,176 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2011లో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినపుడు, బీసీలకు మాత్రం తాజా కులగణన ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదన్నారు. సోషియో ఎకనామిక్స్ సర్వే బేసిస్ పైనే రిజర్వేషన్లు చేసి ఉంటే.. కొత్తగూడెంలో 25 గ్రామాల్లో సగానికి సగం బీసీలకు వచ్చేదన్నారు. మంత్రులు ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తే వారికే రిజర్వేషన్లు ఇస్తున్నారని కవిత దుయ్యబట్టారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు జరుగుతున్నాయా లేక రాజ్యాంగ బద్ధంగా జరుగుతున్నాయా? రాహుల్ గాంధీ తెలుసుకోవాలని, దీనిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.






