- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాయిసెస్ ఆఫ్ పర్పస్ కు తెలంగాణ వేదిక : మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ
ప్రపంచ వేదికపై తెలంగాణకు ప్రత్యేక స్థానం లభించింది. 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ టీ-హబ్‌లో విజయవంతంగా నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వేదికపై తెలంగాణకు ప్రత్యేక స్థానం లభించింది. 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ టీ-హబ్‌లో విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన పోటీదారులు బ్యూటీ విత్ పర్పస్ లో భాగంగా తమ సామాజిక కోణాన్ని, మెరుగైన ప్రపంచం కోసం తమ ఆశయాలను పంచుకున్నారు. అంతేకాకుండా పోటీ దారులు విస్తృత సామాజిక అంశాలపై దృష్టిసారించారు.
బాలల విద్య, పర్యావరణం, పక్షవాతం, ప్రకృతి పరిరక్షణ, యువతుల మద్దతు, చిన్న సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కౌమార దశలో ఆందోళన, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, భాషా పరిరక్షణ, పిల్లల్లో హింస, సౌరశక్తి వినియోగం, ప్లాస్టిక్ కాలుష్యం, లింగ-ఆధారిత హింస, బాల లైంగిక వేధింపులు, ప్రత్యేక వర్గాల విద్య, ఆర్థిక సంక్షోభాలు, ఆటిజం, మాదక ద్రవ్య వ్యతిరేక విద్య వంటి అనేక ముఖ్యమైన ప్రపంచ, స్థానిక సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఖండాలవారీగా ప్రదర్శనలు
మే 20న అమెరికా, కరేబియన్, ఆఫ్రికాకు చెందిన అందాల భామలు తమ ప్రదర్శనలు ఇవ్వగా, మే 21న యూరప్, ఆసియా, అఓషియానియా ప్రతినిధులు పాల్గొననున్నారు. బ్యూటీస్ తమ మనకు మనసుకు నచ్చిన అంశాలను మాట్లాడడానికి, సమాజంలో మంచి మార్పుకు లీడర్ షిప్ కమిట్మెంట్లపై వారికి అవకాశం లభించింది. మిస్ వరల్డ్ పోటీకి ప్రధానాంశమైన హెడ్-టు-హెడ్ ఛాలెంజ్, మానవతా విలువలపై ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ నుండి వాతావరణ మార్పులు, సమాజ అభివృద్ధి వరకు వివిధ సమస్యలను పరిష్కరించడానికి ముద్దుగుమ్మలకు ఈ వేదిక చాలా కీలకమైంది.
తెలంగాణకు ప్రత్యేక గౌరవం:
టీ హబ్ వేదికగా హెడ్ టూ హెడ్ టూ ఛాలెంజ్ లో భాగంగా ముద్దుగుమ్మలు తమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ప్రపంచం తెలంగాణ వైపు చూసే అవకాశం లభించింది. ప్రపంచంలోని ప్రేక్షకులు తెలంగాణ ఎదుగుతున్న తీరును చూసే అవకాశం లభించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా మోర్లే మాట్లాడుతూ, హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ కేవలం ఒక పోటీ కాదని, ధైర్యం, కరుణ, సంకల్పానికి ఒక వేడుక అన్నారు. ఈ యువతులు ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చిన కథలు నన్ను ఎంతగానో ప్రేరేపించాయన్నారు. దూరదృష్టి గల తెలంగాణలో దీనిని నిర్వహించడం ఈ కార్యక్రమానికి మరింత అర్ధాన్ని ఇచ్చిందని కొనియాడారు.






