Chandrababu Naidu;‘తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్.. పునాదులు మావే’

by Sathputhe Rajesh |   (  Updated:2023-06-06 15:51:04  IST  )

బీజేపీతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నోరుమెదపలేదు.

Chandrababu Naidu;‘తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్.. పునాదులు మావే’
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నోరుమెదపలేదు. గత మూడ్రోజుల క్రితం ఢిల్లీలో కేంద్రంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈభేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ, తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తులు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగింది. కానీ మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన సందర్భంగా చంద్రబాబు పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒంటరిగా వెళ్తారా? పోటీపై వెళ్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. మీడియా పొత్తులపై అడిగినప్పటికీ వివరాలు వెళ్లడించడానికి విముఖత చూపారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం వస్తుందని, ఏపీలో అధికారంలోకి వస్తామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ వేసిన పునాదులతోనే దేశంలోనే నెంబర్ వన్‌గా మారిందన్నారు.

Also Read..

తెలంగాణపై చంద్రబాబు ఫోకస్.. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకోనుందా..?

CM KCR పాలమూరు పబ్లిక్‌ మీటింగ్‌లో రేవంత్‌ రెడ్డిపై ఫైర్...

Next Story