- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎకో టూరిజం హబ్‌గా తెలంగాణ
తెలంగాణను ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎకో టూరిజం కోసం గుర్తించిన ప్రాంతాలలో సమగ్రంగా అభివృద్ది చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎకో టూరిజం కోసం గుర్తించిన ప్రాంతాలలో సమగ్రంగా అభివృద్ది చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఒక ప్రత్యేక ఎకో-టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ టూరిజం పాలసీలో అంశాలను మనం ఎంత వరకు ఉపయోగించి... ఎకో టూరిజాన్ని మన రాష్ట్రంలో డెవలప్ చేయోచ్చన్న విషయాలను మంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మంత్రి కొండా అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఎకోటూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రం లోని వివిధ జిల్లాల్లో జరుగుతున్న ఎకో-టూరిజం ప్రాజెక్టుల పురోగతిని మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. స్క్రీనింగ్ కమిటీ భేటీలో అనంతగిరి (వికారాబాద్), కనకగిరి (ఖమ్మం), నందిపేట్(నిజామాబాద్), మన్ననూర్ జంగల్ రిసార్టు (నాగర్ కర్నూల్), ముచ్చెర్ల ఎకో పార్కు(నల్గొండ), వైజాగ్ కాలనీ(నల్గొండ), మంజీరా(సంగారెడ్డి), అమరగిరి (నాగర్ కర్నూల్) తదితర ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు అమలుపై సుదర్ఘీ చర్చ జరిగింది. ఎక్కడికక్కడ ఆయా ఎకో టూరిజం సెంటర్లలో స్థానిక గిరిజనులు, ఇతర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయాలని సూచించారు. ఎకో టూరిజం డెవలప్ చేస్తున్న ప్రాంతాల్లో టెంపుల్స్ ఉంటే వాటిని కూడా ఆ మేరకు డెవలప్ చేయాలని సూచించారు. ఆథ్యాత్మిక పద్ధతిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
* నీలాద్రి అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి
ఖమ్మం జిల్లాలోని నీలాద్రి అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపించాలని మంత్రి ఆదేశించారు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బెక్కా కొండల తరహాలో నీలాద్రి కొండలపై ప్రాచీన కాలం నాటి గుర్తులు ఉన్నందున పర్యాటక ప్రాంతంగా ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్ గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన నిధులు టూరిజం డిపార్టుమెంటు, ఎండోమెంటు శాఖ నుంచి తీసుకొని అయినా డెవలప్ చేయాలన్నారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్ మొదటి దశ పనులు పూర్తయ్యాయని, రెండో దశలో కారవాన్ క్యాంపింగ్, ఎకో కాటేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మంలోని కనకగిరి ప్రాజెక్టు పనులు అక్టోబర్ 2025 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. నల్గొండ ముచ్చర్ల ఎకో పార్క్ నైట్ సఫారీ, వీఆర్ పార్క్, డైనోసార్ పార్క్ వంటివి రూపకల్పన చేసినట్టు వివరించారు. సంగారెడ్డిలోని మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో భూసేకరణ, భూమి కేటాయింపు సమస్యల పరిష్కారం పెండింగ్‌లో ఉందన్నారు. నిజామాబాద్ నందిపేట్, నాగర్‌కర్నూల్ మన్ననూరు , దొమలపెంట, అమరగిరి, పాకాల సరస్సు, కిన్నెరసాని, నాగార్జునసాగర్, వనస్థలి మొదలైన
* ఆలయాలున్న ప్రాంతాల్లో ఆధ్యాత్మికతతో ఎకో-టూరిజం
ఎకో-టూరిజం ప్రాజెక్టులు కేవలం ప్రకృతి వైభవం వరకే పరిమితం కాకుండా, అక్కడి ఆలయ చరిత్ర, ప్రాధాన్యత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని మంత్రి కొండా సురేఖ సమావేశంలో ప్రస్తావించారు. ఎక్కడ ఆలయాలు ఉన్నాయో అక్కడి ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, ధార్మిక విశ్వాసాలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకులు కేవలం స్థానిక ప్రకృతి సౌందర్యం మాత్రమే కాకుండా, ఒక విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతితో కూడిన తృప్తితో సందర్శిస్తారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, అటవీ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్ సువర్ణ, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ సునీత భగవత్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్), ఏలూ సింగ్ మేరు, సీసీఎఫ్ డాక్టర్ జి. రామలింగం (సోషల్ ఫారెస్టు), పలు జిల్లాల డీఎఫ్ఓలు, ఆర్థిక శాఖ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






