- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆవిష్కరణలో దేశానికి దారి చూపుతున్న తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు
ఆవిష్కరణలలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి దారిదీపంలా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆవిష్కరణలలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి దారిదీపంలా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు-2025 కౌంట్‌డౌన్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తెలుగు టెక్నాలజీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక మార్పులకు దారితీస్తున్నారని చెప్పారు. డబ్ల్యూటీఐటీసీ 2025 దుబాయ్ కాన్ఫరెన్స్ మన గ్లోబల్ ప్రతిభ, ఇన్నోవేషన్, కలబోరేషన్‌కు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు ఐటీ మిషన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. డిసెంబర్ 12 నుంచి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్న ఈ అంతర్జాతీయ ఐటీ మహాసభలలో 100 కంటే ఎక్కువ దేశాల తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, ఇన్నోవేటర్లు పాల్గొననున్నారని తెలిపారు. డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ టీ హబ్‌లో ఈ కౌంట్‌డౌన్ ప్రారంభంతో చారిత్రాత్మక గ్లోబల్ ఈవెంట్ కోసం తమ పనులు తుది దశకు చేరాయన్నారు.
డబ్ల్యూటీఐటీసీ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నాలజీ నిపుణులు, ఇన్నోవేటర్లు, ఇన్వెస్టర్లు ఒక్క జెండా కింద ఏకం అవుతారని.. ఇది గ్లోబల్ టెక్ కథనాన్ని కొత్త దిశలో మలుస్తుందని అన్నారు. దుబాయ్ ఎడిషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తారని తెలిపారు.
అలాగే డబ్ల్యూటీఐటీసీ గ్లోబల్ ఇన్వెస్టర్ పిచ్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్‌పో, విమెన్ ఇన్ టెక్ సమ్మిట్, అలాగే 2026–28 గ్లోబల్ లీడర్షిప్ టీమ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ టెక్నాలజీ, స్టార్టప్, ఇన్నోవేషన్ ప్రాధాన్య కార్యక్రమాలను సంయుక్తంగా ప్రదర్శించనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధారెడ్డి, డబ్ల్యూటీఐటీసీ సభ్యులు యామిని, మానస, అక్షిత సింగారం, ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.






