- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగిరే.. పవన్ కల్యాణ్‍కు కేటీఆర్ కౌంటర్
తెలంగాణలో పోటీ చేస్తామన్న పవన్ కల్యాణ్ ను ఎవరు అడ్డుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తే ఇక్కడి ప్రజలే అడ్డుకున్నారని అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది ముమ్మాటికి తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అన్నారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పారు.. కానీ జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేది ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో జనసేన పోటీ చేశారని మొన్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పవన్ పోటీ చేశారని గుర్తు చేశారు. ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని పవన్ అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ప్రాంతీయ వాదమా? దేశభక్తి గురించి మేము పవన్ కల్యాణ్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. నిజాం సర్కార్‍కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల ఇదని అన్నారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‍లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదన్నారు.
మా సెక్రటేరియట్‍లో పెత్తనం నడవదు:
నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై:
దశాబ్దకాలపు మా పరిపాలనలో సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించామని, మాకు కూడా కేసీఆర్ లాంటి పాలకుడు కావాలని అనుకునేలా పదేళ్ల పాలన సాగిందని కేటీఆర్ అన్నారు. ఈ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికి కొన్ని పాఠాలు నేర్పించిందని మన పథకాలను కేంద్రం, మరికొన్ని రాష్ట్రాలు కాపీ కొట్టాయన్నారు. కేటీఆర్ హయాంలో అభివృద్ధిలో తెలంగాణ నం.1గా నిలిచిందన్నారు. 3 శాతం జనాభా 5 శాతం జీడీపీ కాంట్రిబ్యూషన్ చేసిందని తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. ఇది తప్పని కాంగ్రెస్, బీజేపీ నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. నాలుగు కోట్ల ప్రజలు మా కుటుంబమే అని భావించి పాలించామని కానీ తెలంగాణ వస్తే ఒక కుటుంబమే బాగుపడిందని దుష్ప్రచారం చేశారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ లేదని తెలంగాణ వ్యతిరేకులు పదవిలో కూర్చువడమే బాధాకరం అన్నారు.
నినాదం రైజింగ్.. విధానం మాత్రం ఫాలింగ్:
6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్, భట్టి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నినాదం రైజింగ్.. విధానం మాత్రం ఫాలింగ్ అని ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా ప్రభుత్వ ఆదాయం పతనమవుతోందన్నారు. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని ప్రజలకు అర్థమైందన్నారు. 2014 లో తెలంగాణలో సాగుభూమి విస్తీర్ణం 1.50 కోట్ల ఎకరాలు మాత్రమేనని కానీ 2023లో బీఆర్ఎస్ దిగిపోయే నాటికి సాగు విస్తీర్ణం 2.29 కోట్ల ఎకరాలకు చేరిందన్నారు. చివరి గింజ ధాన్యం కొంటామని తొలిగింజనే సరిగా కొనలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ శాంతియుత పంథా మారలేదన్నారు. అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు.
జర్నలిస్టులకు ఇళ్లస్థలాలపై:
ప్రభుత్వం చెబుతున్నట్లు ఫ్యూచర్ సిటీ ఏమీ లేదని అక్కడ భూములు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు అన్నారు. అందువల్ల ఈ భూములపై హరీశ్ రావు చెప్పిన మాటలు నిజమే అన్నారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. కానీ పేట్ బషీరాబాద్, మంచిరేవులు, బుద్వేలు ప్రాంతాంలో ఇవ్వొచ్చుకాదా అక్కడ చాలా భూములు ఉన్నాయన్నారు.






