కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి : టీపీసీసీ ఛీప్​

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన యావత్​దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి : టీపీసీసీ ఛీప్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన యావత్​దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలోని ఇందిరా భవన్ ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం బీసీ కుల గణననపై పవర్​పాయింట్​ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ నాయకులు జైరాం రమేష్, కొప్పుల రాజు, మధు యాష్కీతోపాటు దేశవ్యాప్తంగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధులు, మీడియా ఇంచార్జ్ లు పాలుపంచుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ కుల గణననపై పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుల గణననలో హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో కుల గణన హామీ ఇవ్వడంతో సమాజంలో బీసీసీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కుల గణననపై అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వర్గం కుల గణన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోని వేగవంతంగా కార్యాచరణ చేపట్టారని తెలిపారు. శాస్త్రీయంగా కుల గణన చేపట్టారని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా క్యాబినెట్ ఉప సంఘం వేశారన్నారు. ఆతరువాత క్యాబినెట్ లో ఆమోదం, అసెంబ్లీ లో బిల్లు చేసి సమగ్రమైన చర్చ జరిపామన్నారు. ఈ కుల గణన వల్ల రాష్ట్రంలో కులాల వారీగా లెక్కలు తేలాయని, దాంతో ఏ కులానికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలో లెక్క తేలిందిన్నారు. కుల గణన దేశంలోనే మొదటిసారి తెలంగాణ లో జరగడం, అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగడం గొప్పతనమని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ లో కులఘనన చేపట్టామన్నారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్లు చేయాలని అసెంబ్లీ లో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని కృషి చేస్తున్నామని చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని ఈసందర్భంగా పీసీసీ ఛీప్​మగేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Next Story