తెలంగాణ మహిళా అధికారికి ఢిల్లీలో చేదు అనుభవం.. సీఎం రేవంత్ నివాసంలోకి నో ఎంట్రీ

by Naga Rani Yarlagadda |

తెలంగాణ మహిళా అధికారికి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది.

తెలంగాణ మహిళా అధికారికి ఢిల్లీలో చేదు అనుభవం.. సీఎం రేవంత్ నివాసంలోకి నో ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మహిళా అధికారికి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. I&PR అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవి సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిసేందుకు ఢిల్లీలోని ఆయన నివాసం వద్దకు వెళ్లగా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. తాను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ను అని చెప్పినా వినిపించుకోకపోవడంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. హర్షభార్గవి ఎవరో తమకు తెలియదన్న స్థానిక పోలీసులు.. సీఎం ఇంటి గేటు బయటే నిలబడితే అరెస్ట్ చేస్తామని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. హర్షభార్గవిని ఇటీవలే పౌరసంబంధాల శాఖ CPROగా నియమించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లిన ఆమెకు ఇంతటి ఘోర అవమానం జరింది.

తొలుత ఆమె ఎవరో తెలియదని సిబ్బంది చెప్పడంతో.. తన ఐడీ కార్డును చూపించారు. అయినా ఇంటి ఇంటి లోపలి నుంచి ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని ఆదేశాలు రావడంతో పోలీసులు వెళ్లిపోవాలని, లేదంటే అరెస్ట్ చేస్తామన్నారు. అక్కడికి చేరుకున్న రాష్ట్ర మీడియా ప్రతినిధులు.. హర్షభార్గవి ప్రభుత్వ అధికారిణి అని చెప్పి ఆమె అరెస్టును అడ్డుకున్నారు.

Next Story