TG News : రేపటి నుంచి తెలంగాణ ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షలు

by Muthe.Rajitha |   (  Updated:2025-05-21 15:23:03  IST  )

రేపటి నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు(TG Intermediate Supplementary Exams) జరగనున్నాయి.

TG News : రేపటి నుంచి తెలంగాణ ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : రేపటి నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు(TG Intermediate Supplementary Exams) జరగనున్నాయి. మే 22 నుంచి 29, 2025 వరకు జరుగనుండగా.. ఉదయం 9:00-12:00 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30-5:30 గంటల వరకు రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా 2,66,207 మంది ఫస్టియర్ పరీక్షలు, 1,47,390 మంది సెకండియర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3-6, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జూన్ 9-10, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ జూన్ 11, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ జూన్ 12న జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 892 కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతాయని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు(TSBIE) ప్రకటించింది.

Next Story