- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా ఉందని, పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు చేపట్టామని, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా పెరగాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం రాజస్థాన్ లోని ఉదయపూర్ పట్టణంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన చింతన్ శివిర్ లో మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితోపాటు, అన్ని రాష్ట్రాల మహిళా సి సంక్షేమ శాఖ మంత్రులు, అధికారులు హాజరైన ఈ సదస్సుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ లతో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక పథకాలు, సాధించిన పురోగతి, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం పై మంత్రి సీతక్క మాట్లాడారు. చిన్నారుల, గర్భిణులు బాలింతలకు పోషకాహారం అందించడంలో అంగన్వాడి కేంద్రాలు పోషిస్తున్న పాత్రను వివరించారు. ఆదివాసి బిడ్డగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
తెలంగాణలో ప్రత్యేకంగా ఆరోగ్యలక్ష్మి అనే పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు ప్రతిరోజు 200 మిల్లీ లీటర్ల పాలతో పాటు అదనపు గుడ్డును అందిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం ఏటా రూ. 296 కోట్ల ను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక ప్రకారం సరైన పోషకాహారం అందకపోవటంతో దేశంలో 30 శాతానికి పైగా ఐదేళ్ల లోపు చిన్నారులు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని, మహిళలు రక్తహీనతతో సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాడితే తప్ప ఈ సమస్యలను రూపుమాపలేమని పేర్కొన్నారు. అయితే పోషకాలు అధికంగా ఉన్న కోడిగుడ్లను బిజెపి పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడి కేంద్రాల్లో పంపిణీ చేయడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాలకు తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తన వాటాను పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళా సంక్షేమం కోసం 15.26 లక్షల మంది విడోలకి , 1.41 లక్షల ఒంటరి మహిళలకు నెలకు రూ. 2000 పెన్షన్ను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే విడోలకి ఇస్తున్న పెన్షన్ లో కేంద్రం తన వాటాగా 200 రూపాయలు మాత్రమే ఇస్తోందన్నారు. 33 జిల్లాల్లో 39 బాల రక్షక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని, అవసరం ఉన్న పిల్లల వద్దకు చేరుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ నుండి శిశు విహార్ ద్వారా ఆరేండ్ల లోపు పిల్లల దత్తత ప్రక్రియను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని మంత్రి సీతక్క ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీతక్క ప్రసంగానికి ప్రశంసలు:
చివరగా అన్నార్తులు, అనాధలు, ఆకలి బాధ లేని సమాజాన్ని ప్రసాదించాలన్న సంత్ కబీర్ సూక్తితో, దాశరధిపత్యంతో తన ప్రసంగాన్ని మంత్రి సీతక్క ముగించారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సీతక్క ప్రసంగం భిన్నంగా సాగటంతో అంతా ప్రశంసించారు. సీతక్క ప్రసంగాన్ని శ్రద్ధగా విన్న ఇతర రాష్ట్రాల మంత్రులు అధికారులు, చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు. మిజోరాం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లాల్రిన్ పుయీ తమ సంప్రదాయ కండువాను సీతక్కకు బహూకరించి అభినందనలు తెలియజేశారు
రెండు విభాగాల్లో బెస్ట్ స్టేట్ గా తెలంగాణ:
దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థ.. వెంగళరావునగర్లోని మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్ ప్రాంగణంలో ఆశాక ఆధ్వర్యంలో మూడేండ్ల డిప్లమా కోర్స్ అందిస్తోంది. ప్రతి ఏటా 240 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఇందులో 70 శాతం మంది అంటే 168 మంది అనాధ పిల్లలు, అభాగ్యులు, మానవ అక్రమ రవాణా బాధితులు ఉంటారు. అనాధ పిల్లలను చెర తీయడంతో పాటు వారికి విద్యాబుద్ధులు నేర్పి, సాంకేతిక శిక్షణతో వారికి మెరుగైన ఉపాధి కల్పిస్తున్న శిక్షణ సంస్థ ను బెస్ట్ ప్రాక్టీస్ గా కేంద్రం గుర్తించింది.
కూకట్పల్లిలోని మహిళా ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటి మహిళా డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎమ్ఒడబ్యూఓ అనే స్వచ్ఛంద సంస్థ టెక్నికల్ పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ఇక్కడ మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వటంతో పాటు లైసెన్స్ ను ఇప్పిస్తారు. ఈ ట్రైనింగ్ సెంటర్లో డ్రైవింగ్లో మెలకువలతో పాటు రోడ్ సేఫ్టీ, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల ను కల్పించేందుకు కృషి చేస్తారు. ఈ రెండు సంస్థలు దేశంలోనే మొట్టమొదటివి. అందుకే ఈ రెండు విభాగాల్లో తెలంగాణను కేంద్రం బెస్ట్ ప్రాక్టీసెస్ గా గుర్తించి ప్రశంసించింది. తద్వారా ఇతర రాష్ట్రాలకు ఈ విభాగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
అధికారులకు మంత్రి అభినందనలు:
వీటితోపాటు పని ప్రాంతాల్లో లింక వేధింపుల బాధితులకు బాసటగా నిలిచేందుకు, సత్ర న్యాయం కల్పించేందుకు ఎనిమిది లేబర్ కోర్టులను ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ను తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పింది. మహిళా భద్రత కోసం, సత్వర న్యాయం కోసం తెలంగాణ లేబర్ కోర్ట్ ల విధానాన్ని కేంద్రం అభినందించింది. రెండు విభాగాల్లో బెస్ట్ స్టేట్ గా తెలంగాణ ను కేంద్ర గుర్తింపు రావడం పట్ల మంత్రి సీతక్క అధికారులను అభినందించారు. మరింత పట్టుదలగా పనిచేసి మహిళా సంక్షేమలో తెలంగాణను బెస్ట్ స్టేట్ గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.






