- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 7న తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ (TGICET) పరీక్ష ఫలితాలను అధికారులు ఈ నెల 7న విడుదల చేయాలని నిర్ణయించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGICET 2025) ఫలితాలను జులై 7న విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఐసెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య రవి ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తెలియజేశారు. జులై 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు.
TGICET 2025 పరీక్షలు జూన్ 8, 9 తేదీలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA), కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఫలితాల విడుదల తరువాత, కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలు, మార్గదర్శకాలు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటించనున్నారు.






