- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ ఫైటింగ్ స్పిరిట్ చాలా రాష్ట్రాలకు ఆదర్శం’.. తమిళనాడు సీఎంను అభినందించిన తెలంగాణ IAS అధికారి
తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Govt) సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి లేకుండానే 10బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Govt) సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి లేకుండానే 10బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో గవర్నర్ ప్రమేయం లేకుండానే బిల్లులకు చట్ట హోదా కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపే బిల్లులను నెలలోగా అనుమతించకపోతే అది చట్టరూపం దాల్చినట్లు భావించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తాజాగా ఈ పరిణామంపై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి(Akunuri Murali) స్పందించారు. తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోసల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘శభాష్ స్టాలిన్ గారు. మీ ఫైటింగ్ స్పిరిట్ చాలా రాష్ట్రాలకు ఆదర్శం. BJP గవర్నర్ల ద్వారా రాజకీయం చేస్తూ అప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు ధన్యవాదాలు’ అని ఆకునూరి మురళి పేర్కొన్నారు.
శబాష్ స్టాలిన్ జీ !
— Murali Akunuri (@Murali_IASretd) April 13, 2025
మీ ఫైటింగ్ స్పిరిట్ చాలా రాష్ట్రాలకు good inspiration..
BJP గవర్నర్ల ద్వారా రాజకీయం చేస్తూ అప్రజాస్వామ్య పరిపాలన చేస్తుంది ..
సుప్రీమ్ కోర్ట్ కు ధన్యవాదాలు 🙏
కానీ సుప్రీంకోర్టు రాష్ట్రపతి కి కూడా గడువు విధించడం కొంచెం అతి అనిపిస్తుంది..
రాజ్యాంగం… pic.twitter.com/rNQD6kKfAz






