- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్(Telangana Hostel Welfare Officers) ఫలితాలు విడుదల అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్(Telangana Hostel Welfare Officers) ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్(Provisional Selection List)ను సోమవారం టీజీపీఎస్‌సీ(TGPSC) విడుదల చేసింది. మొత్తం 581 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించగా.. 574 మంది ఎంపిక అయినట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. తుది జాబితాను అధికారిక వెబ్‌సైట్(https://www.tspsc.gov.in/)లో పొందుపరిచినట్లు పేర్కొన్నది.
కాగా, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు (Hostel Welfare Officer), శిశు సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులు ఉన్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఉన్నాయి.






