స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయండి: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది.

స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయండి: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‍లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ రెడ్డి జాగృతి మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ లాయర్లు చిక్కుడు ప్రభాకర్‌, మయూర్‌ రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆన్ లైన్‍లో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని, అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోండి అని వ్యాఖ్యానించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా విచారిస్తామని స్పష్టం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం తరఫు నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశించిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

Next Story