- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై కీలక ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. ఎందుకంటే...

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంపై (Telangana High Court) రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. (Gurukulam) ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల (BC Welfare Gurukula) పాఠశాలలో కలుషిత ఆహారం తిని 111 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇవాళ హైకోర్టు ఆరా తీసింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఇక నాగర్‌కర్నూల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఈనెల 28న పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. కాగా, ఈ ఫుడ్‌పాయిజన్ సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఘటనపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్కీకరించి విచారణ చేపట్టింది. ఈ ఘటనపై ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్ఆర్సీ ఇటీవల ఆదేశించింది.






