- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
by Malleboina Mahesh |
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి (Amrapali)కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ (CAT) జారీ చేసిన ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఆమ్రపాలికి కేటాయింపు విషయంలో తాత్కాలికంగా అడ్డంకి ఎదురైంది.
తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా
ఈ సందర్భంగా, హైకోర్టు ఐఏఎస్ ఆమ్రపాలికి కౌంటర్ (ప్రతివాదన) దాఖలు చేయాలని సూచించింది. అనంతరం, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ ఐఏఎస్ అధికారిణి కేటాయింపు వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.
Next Story






