MPTC, ZPTC ఎన్నికల్లో రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

by Prasad Jukanti |

తెలంగాణ హైకోర్టులో రిజర్వేషన్ల అంశంపై పిటిషన్ దాఖలైంది.

MPTC, ZPTC ఎన్నికల్లో రిజర్వేషన్లపై  తెలంగాణ హైకోర్టులో పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఎస్సీ రిజర్వేషన్ల (SC Reservations) కోసం పిటిషన్ దాఖలైంది. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 27న తెలంగాణ హైకోర్టు విచారణ జరుపబోతోంది. కాగా గత నెలలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో మిగతా స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దం అవుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story