- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు గుడ్ న్యూస్
తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన హామీల అమలుపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉద్యమకారులకు లబ్ధి చేకూరనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన హామీల అమలుపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉద్యమకారులకు లబ్ధి చేకూరనుంది. అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడమ్ ఫైటర్ శాఖ అధికారులకు జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని థర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హతల పరిశీలనలో ఆలస్యం చేయకుండా, విధివిధానాల ప్రకారం కేసులను పరిష్కరించి ప్రయోజనాలు అందించాల్సిందిగా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు పెన్షన్లు, ఇండ్ల స్థలాలు కల్పించాలన్న హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఉద్యమ జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. “అభయహస్తం” పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు ప్రభుత్వం తక్షణమే ప్రయోజనాలు అందించాలంటూ పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ల తరఫున హైకోర్టు న్యాయవాది జి.కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు రాజ్యాంగబద్ధమైన న్యాయసమ్మత హక్కుల పరిధిలో వస్తాయని అడ్వొకేట్ వాదనలలో తెలిపారు.






