ఎంతసేపూ పేదలేనా, పెద్దల జోలికి వెళ్లరా?.. హైడ్రాపై హైకోర్టు సీరియస్

by Gantepaka Srikanth |

హైడ్రా(Hydraa)పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఎంతసేపూ పేదలేనా, పెద్దల జోలికి వెళ్లరా?.. హైడ్రాపై హైకోర్టు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa)పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా(Hydraa) టార్గెట్ పేద, మధ్యతరగతి ప్రజలేనా? అని ప్రశ్నించింది. అసలు పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని మండిపడింది. ప్రముఖులకు రాష్ట్రంలో ప్రత్యేకమైన చట్టం ఏమైనా ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మియాపూర్, దుర్గం చెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా వ్యవస్థకు సార్థతక అని అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఎంత క్షుణ్ణంగా పరిశీలించి చూసినా.. ఎక్కడా కూడా హైడ్రా పనితీరు ఆశాజనకంగా లేదని పేర్కొంది. మీరాలంపై ఉమ్మడి సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన చిన్నా, పెద్దల భవనాలన్నీ కూల్చివేయాల్సిందే అని.. అదే హైడ్రా(Hydraa) పని కదా అని గుర్తుచేసింది. అందరినీ సమానంగా చూసి.. పెద్దల భవనాలు కూడా కూల్చినప్పుడే ప్రభుత్వ భూములు రక్షించినట్లు అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కేవలం పేదల నిర్మాణాలను కూల్చితే ప్రయోజనం లేదని పేర్కొంది. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దారు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దుర్గం చెరువు, మియాపూర్ చెరువులలోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ప్రశ్నించింది.

Next Story