- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరా గ్రూపుకు ఎదురుదెబ్బ.. భారీ జరిమానా విధించిన హైకోర్టు
హీరా గ్రూపునకు తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేసి..

దిశ, వెబ్‌డెస్క్: హీరా గ్రూపునకు తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేసి.. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను భారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు. నౌహీరా షేక్ కు చెందిన హీరా గ్రూపునకు రూ.5కోట్ల జరిమానా విధించిన ఆయన.. ఆ మొత్తాన్నీ వారాల్లో పీఎం సహాయనిధికి జమ చేయాల్సిందిగా ఆదేశించారు.
పేదల నుంచి పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని పేర్కొంటూ హీరో గ్రూప్, నౌహీరా షేక్ పై ఈడీ అధికారులు PMLA కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కంపెనీకి చెందిన 59 ఆస్తుల్ని అటచ్ చేశారు. ఈ ఆస్తుల్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేలం వేసేందుకు ఈడీ అధికారులు MSTC లిమిటెడ్ వెబ్ సైట్లో వివరాలను అప్ లోడ్ చేశారు. డిసెంబర్ 26న ఆస్తుల్ని వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.
కాగా.. ఈడీ అధికారులు ఆస్తుల వేలాన్ని సరిగా నిర్వహించడం లేదని, ఆస్తుల విలువను చాలా తక్కువగా చూపించారంటూ నౌహీరా షేక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఈ వేలాన్ని రద్దు చేయాలని, ఆస్తులవేలం వేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక.. ఇరువైపులా వాదనలు విన్నారు. పిటిషనర్ తప్పుడు పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు జరిమానాగా హీరా గ్రూపునకు రూ.5 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.






