High Court : గ్రూప్ 1 పిటిషనర్లకు హైకోర్ట్ భారీ షాక్

by Muthe.Rajitha |

గ్రూప్ 1(Group 1) పిటిషనర్లకు హైకోర్ట్(High Court) భారీ షాకిచ్చింది.

High Court : గ్రూప్ 1 పిటిషనర్లకు హైకోర్ట్ భారీ షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్ 1(Group 1) పిటిషనర్లకు హైకోర్ట్(High Court) భారీ షాకిచ్చింది. తప్పుడు ప్రమాణ పత్రాలతో(False Affidavit) వీటిషన్ దాఖలు చేసారంటూ హైకోర్ట్ రూ.20 వేల జరిమానా(Fine) విధించింది. అలాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులనుఈ ఆదేశించడం సంచలనం రేపింది. టీజీపీఎస్సీ(TGPSC) నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ లో అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ మొత్తం 19 మంది గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెమోకు వెబ్సైట్ మార్కులకు భారీ తేడాలు ఉన్నాయని, మరోసారి సమాధాన పత్రాలు రీవాల్యుయేషన్ చేయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్ట్.. పిటిషనర్లు తప్పుడు ప్రమాణ పత్రాలు దాఖలు చేశారని కమిషన్ తరపు న్యాయవాది తెలపగా.. పిటిషనర్ల ప్రాథమిక వివరాలు పరిశీలించి.. అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని పేర్కొంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారికి ఒక్కొక్కరికీ రూ.20 వేల భారీ జరిమానా విధించడమే కాకుండా, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story