వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. డీజే టిల్లును మించిన పెర్ఫామెన్స్ (వీడియో)

by Disha Web Desk 2 |
వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. డీజే టిల్లును మించిన పెర్ఫామెన్స్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తెలంగాణ మహిళలు పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ సంబురాల్లో డీహెచ్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సంబురాల్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్సార్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న హెల్త్ డైరెక్టర్ డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. బతుకమ్మ సంబురాల్లో శ్రీనివాస్ రావు వ్యవహరించిన తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తు్న్నారు. నువ్వు డీహెచ్‌వా? లేక డీజే టిల్లువా? బతుకమ్మ పరువు తీయకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఒక ప్రభుత్వ అధికారి తెలంగాణ సాంస్కృతిక పండుగ సంబురాల్లో సినిమా పాటలకు స్టెప్పులేయడంతో మహిళలతో సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇంతకు ముందు శ్రీనివాస్ క్షుద్రపూజలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిమ్నా తండాలో నిర్వహించిన పలు పూజల్లో శ్రీనివాస్ రావు పాల్గొనడంతో అది కాస్త వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed