ఎమ్మెల్యేల్లో మంత్రి హరీష్ రావు బెస్ట్!

by Disha Web Desk 2 |
ఎమ్మెల్యేల్లో మంత్రి హరీష్ రావు బెస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి హరీష్ రావును ఉద్దేశించి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉన్న గడల శ్రీనివాస రావు గత కొంత కాలంగా కొత్తగూడెంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అక్కడ పర్యటించిన ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఎవరైనా ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యే ఉన్నారంటే అది మంత్రి హరీష్ రావు అన్నారు.

హరీశ్ రావు సిద్దిపేటకు చేసిన దాంట్లో 50 శాతం పనులు చేసినా కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉద్యోగరీత్యా తాను సిద్ధిపేటకు అనేకసార్లు వెళ్లానని అక్కడ హరీష్ రావు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. విద్యా, వైద్యం, ఆహ్లాదం ఇలా అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుంచారని చెప్పారు. అభివృద్ధిలో కొత్తగూడెం మరో సిద్ధిపేటలా కావాలని ఆక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed