- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ గురుకుల ఇంటర్ ప్రవేశాలు: దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ
తెలంగాణ గురుకులాల్లో (TGRJC) ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (TGRJS) ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలలు, కేజీబీవీల్లో (KGBV) 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రవేశ పరీక్షకు (TGRJC-CET 2026) దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15ను చివరి తేదీగా నిర్ణయించారు.
భారీగా దరఖాస్తులు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలతో పాటు 93 కేజీబీవీలలోని ఇంగ్లీషు మీడియం సీట్ల కోసం (MPC/BPC/MEC/CEC గ్రూపులు) ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 45 వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అర్హులైన విద్యార్థులకు మే 3న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కోరారు.
దరఖాస్తు విధానం ఇలా..
పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgrjc.cgg.gov.in/ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అదనపు సమాచారం లేదా సందేహాల కోసం విద్యార్థులు వెబ్‌సైట్‌లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను చూడవచ్చు. ఇతర సహాయం కోసం 7842991708 లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004252428 ను సంప్రదించవచ్చు. అర్హత కలిగిన విద్యార్థులు గడువు ముగిసే లోపు, అంటే ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.






