- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS: గ్రూపు-4 ఫలితాలు విడుదల.. స్తంభించిన వెబ్‌సైట్
అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-4 ఫలితాలను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-4 ఫలితాలను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం అధికారికంగా అభ్యర్థుల ర్యాంకులను వెల్లడించింది. గతేడాది జులైలో గ్రూపు-4 పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది. 8,180 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొంది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని సూచించింది. ధృవపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. మరోవైపు రిజల్ట్స్ వచ్చేశాయని తెలిసిన అభ్యర్థులంతా వెబ్‌సైట్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా సైట్ స్తంభించిపోయింది. సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.
Next Story






